షాద్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల అండదండలు ఎల్లవేళలా ఉంటాయని వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ మరోసారి గెలుపు ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ దీమా వ్యక్తం చేశారు. ఫరూక్నగర్ మండలం బూర్గులలో గులాబీ దండు కదిలింది. ఎమ్మెల్యే అంజన్న ఎన్నికల ప్రచారానికి వాడవాడలా గులాబీ జెండాలు కదంతొక్కాయి. ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే అంజయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో గత తొమ్మిదేళ్లుగా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని కోట్లది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేశామని అన్నారు.
టిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అభివృద్ధి మంత్రాన్ని జపిస్తుందని ప్రజలకు చేయూతని ఇస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు భారీ మెజార్టీతో టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజన్న గులాబీ శ్రేణులకు గ్రామస్తులు భారీ స్వాగతం పలికారు. ఎమ్మెల్యేగా అంజయ్య యాదవ్ గెలుపొందిన నాటి నుండి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను స్థానిక శ్రేణులు ప్రజలకు వివరించారు. రూ. 49 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణం, అంతర్గత మురుగుకాలువల నిర్మాణం పనులు. రైతు బంధు లబ్ధిదారులు 1500 మంది, 2.42 కోట్లు. రైతు రుణమాఫీ లబ్ధిదారులు 1453 మంది, 7.6 కోట్లు. రైతు భీమా లబ్ధిదారులు 11 మంది, 55 లక్షలు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులు 99 మంది, 99.02 లక్షలు.
శ్మశానవాటిక నిర్మాణము కోసం 12.60 లక్షలు, క్రీడా ప్రాంగణం ఏర్పాటు. ఆసరా పింఛన్ ధ్వారా 370 మందికి ప్రతి నెల 8.2 లక్షలు పంపిణీ. చిలకమర్రి నుండి బూర్గుల రోడ్డు నిర్మాణం కోసం 4.65 కోట్లు మంజూరు, బి. టీ మరమత్తులు 4.15 కోట్లు 1.28 కోట్లు వ్యయంతో మిషన్ భగీరథ ద్వారా 1 ట్యాంకు నిర్మాణంతో 664 ఇండ్లకు త్రాగునీటి సరఫరా. రైతు వేదిక 22 లక్షల తో నిర్మాణము. మిషన్ కాకతీయ ద్వారా 4.67 లక్షలతో గోపిగకుంట చెరువు, కొత్తకుంట చెరువు 28.63 లక్షలు, తుంబరాల కుంట 23.07 లక్షలు, 9.92 లక్షలతో అంగడికుంట చెరువు, 11.62 లక్షలతో జలకుంట చెరువు పూడికతిత పనులు.. బి.సి కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం 15 లక్షలు, 10 లక్షలతో ఎస్సి కమ్యూనిటీ భవనం, 5 లక్షల తో ఎస్సీ కమ్యూనిటీ భవనం తిమ్మనగుడలో, కబ్రస్థాన్ కాంపౌండ్ వాల్ 5లక్షలతో, ముదిరాజ్ కమ్యూనిటీ భవనం 5 లక్షలు నిర్మాణము ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కారుగుర్తు పార్టీకి అండగా ఉంటూ కారుగుర్తుకు ఓటు వేసి మరొక్కసారి ఆశీర్వదించాలి, అభివృద్ధిని కొనసాగిద్దామని ఈ సందర్భంగా ప్రజలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ కోరారు.