Saturday, October 5, 2024
HomeతెలంగాణAnjayya Yadav: నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే నా జీవిత లక్ష్యం

Anjayya Yadav: నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే నా జీవిత లక్ష్యం

బిఆర్ఎస్ మ్యానిఫెస్టో తో ప్రజలకు ఎంతో మేలు

షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ షాద్ నగర్ అభ్యర్థి వై అంజయ్య యాదవ్ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఆయనకు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ…

- Advertisement -

తనను మూడోసారి ఆశీర్వదిస్తే షాద్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని వేల కోట్లతో అన్ని రంగాలలో అభివృద్ధి చేశానన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. ప్రతి ఇంటికి పథకాలు అందాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బిఆర్ఎస్ నూతన మ్యానిఫెస్టోతో ప్రజలకు ఎంతో మేలు జరుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని, మూడోసారి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాల అమలులో చరిత్ర సృష్టిస్తుందన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం లో జరిగిన అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ కే పట్టం కట్టాలని కోరారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర వెనుకంజలో ఉండేదని, కాంగ్రెస్ పార్టీ నాయకులు సొంత ఆస్తులను కాపాడుకోవడానికి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పని చేసుకుని మళ్లీ పార్టీలు మారే, నాయకుల మాటలు వినీ మోసపోవదండి? రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అభివృద్ధిలో దూసుకు వెళ్తుందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు అనేక పథకాలు ప్రవేశపెట్టిందని ప్రస్తుతం రైతులకు ఎకరానికి 10000 వేలు ఇస్తుండగా వాటిని 16 వేలకు పెంచారన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద రెండు లక్షలు, గ్యాస్ సిలిండర్ 400 కి ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారన్నారు. సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి పేద మహిళలకు 3 వేలు, దివ్యాంగులకు 6 వేలు చెల్లిస్తామన్నారు. పేదలకు తెల్ల రేషన్ కార్డు ద్వారా దొడ్డు బియ్యానికి బదులు సన్నబియ్యం అందిస్తామన్నారు. ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా పథకం కల్పిస్తున్నామన్నారు. దేశంలోనే ఎక్కడలేని విధంగా రైతులకు రైతుబంధు, 24 గంటల విద్యుత్ అందిస్తున్న రాష్ట్రాలు లేవన్నారు. ఒక తెలంగాణలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కులవృత్తులను బలోపేతం చేసి వారు ఆర్థికంగా బలోపేతం చెందడం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News