తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సమాజాభివృద్ధిలో ముందుకు సాగాలని షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని అన్నారు. తెలంగాణ మట్టిలోనే పోరాట తత్వం ఉందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శనమని ఎమ్మేల్యే చెప్పుకొచ్చారు. హక్కులకోసం ఐలమ్మ చేసిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తి తో ప్రజల హక్కుల సాధన కోసం, తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్, కౌన్సిలర్లు, రజకులు, బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకులు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు.