Thursday, September 19, 2024
HomeతెలంగాణAnjayya Yadav: షాద్ నగర్ 2 వార్డుపై ఎమ్మెల్యే వరాల జల్లు

Anjayya Yadav: షాద్ నగర్ 2 వార్డుపై ఎమ్మెల్యే వరాల జల్లు

కౌన్సిలర్ చెట్ల పావని నరసింహులుఫై ప్రశంసలు

షాద్ నగర్ మున్సిపాలిటీ 2 వార్డు కాలనీ వాసులపై ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వరాల జల్లు కురిపించారు. కౌన్సిలర్ చెట్ల పావని నరసింహ ఆధ్వర్యంలో కాలనీ వాసులు ఎమ్మెల్యేను కలిసి పలు సమస్యలను ఆయనకు వివరించారు. వీటిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అంజయ్య అవసరమైన ప్రతి చోటా అభివృద్ధి పనులను పూర్తిచేస్తామని హామీ ఇస్తూ.. ఈ కింది హామీలు ప్రకటించడం విశేషం.
1. పొచ్చమ్మ టెంపుల్ నుంచి కీర్తి అపార్ట్మెంట్ వరకు సీసీ రోడ్డు
2. ఆఫీర్స్ కాలనిలో ని రెండు రోడ్డులు
3. కల్పకురి ఇంటి నుంచి అంబురావు ఇంటి వరకు
4. చెట్ల కృష్ణ ఇంటి నుంచి చెట్ల వెంకటేష్ ప్లాట్ వరకు
5. కోమటి ఆంజనేయులు ఇంటి నుంచి మల్లేష్ ఇంటి వరకు
6. పాపిరెడ్డి ఇంటి నుంచి శ్రీను ఇంటి వరకు
సీసీ రోడ్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విడతలవారీగా అన్ని కాలనీల్లో అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని తెలిపారు. త్వరలోనే ఆఫీసర్స్ కాలనీలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. విడుదలైన నిధులతో పనులు ప్రారంభమవుతాయని వివరించారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం పట్ల కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చెట్ల పావని నర్సింలు, కాసన్న, పాండు, ప్రసాద్, టీకారం, మహేష్, ఏవో నరేందర్, గుడ్డు, సల్ల మహేష్, వెంకట్, నమస్తే తెలంగాణ కృష్ణ, భూపాల్ రెడ్డి, రామచంద్రయ్య, జుట్టు రాజు, నందిగామ శ్రీనివాస్, నందిగామ జంగయ్య, నందిగామ రాంచంద్రయ్య, దృశ్యం టీవీ సంకూరి నరేందర్, కాలనీ వాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News