ప్రజల బాగు కోసం శ్రమించే బారాస పార్టీని ప్రజల ఆదరించి గెలిపించాలని షాద్నగర్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ పిలుపునిచ్చారు. రేపటి బతుకుదెరువు మీది. కాబట్టి అల్లాటప్పాగా, ఆషామాషీగా ఓటు వేయకండి. ఆలోచించి ఓటు వేయండని, అదే తలరాతను, భవిష్యత్తును నిర్ణయిస్తదన్నారు. బుధవారం ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో కేశంపేట గ్రామంలో పర్యటించారు. బి జె పి, కాంగ్రెస్ పార్టీల నుండి బిఆర్ఎస్ లో చేరారు.
పార్టీలో చేరిన వారిలో బైకని శేఖర్, హరిక్రిష్ణ, బైరమోని హరి, బైకని శ్రీశైలం, మల్లేష్, గణేష్, విజయ్, శ్రీకాత్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు మొనగాళ్లని, అనతికాలంలోనే రికార్డుస్థాయిలో పంటలు పండించారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసిస్తున్నరని ఇది మన తెలంగాణకే కాదు దేశానికి గర్వకారణమని అన్నారు. ‘కేసీఆర్ కలను నిజం చేసిన మొగోళ్లు, మొనగాళ్లు తెలంగాణ రైతులు అని సగర్వంగా చెప్తున్నా’ అని పేర్కొన్నారు. రైతుబంధు దుబారా అని, వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలు అని, ధరణిని తీసేస్తామని చెప్తున్న ప్రతిపక్షాలకు బుద్ధివచ్చేలా ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఓట్లు గుద్దుతే పోలింగ్ బాక్సులు పలగాలె’ అని కెసిఆర్ పిలుపునిచ్చారని ఆయన పిలుపును ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త అందుకోవాలని ఎమ్మెల్యే అంజయ్య సూచించారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని అన్నారు.
ప్రజలు ఎన్నికల ఒరవడిలో కొట్టుకొని పోవద్దని సూచించారు. ప్రజలు గెలిచేదే నిజమైన ఎన్నిక అని, అప్పుడే పాలకులు ప్రజలకు మంచి పనులు చేస్తారని చెప్పారు. ‘యువత ఆలోచన చేయాలి. ఎందుకంటే దేశం మీది, రాష్ట్రం మీది, భవిష్యత్తు మీది, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ఉండే బ్రహ్మాండమైన ఆయుధం ఓటు. దానిని దుర్వినియోగం చెయ్యొద్దు’ అని దిశానిర్దశం చేశారు.