Saturday, November 23, 2024
HomeతెలంగాణAnkapur: కేసీఆర్ తెలంగాణ జాతిపిత, అభినవ గాంధీ

Ankapur: కేసీఆర్ తెలంగాణ జాతిపిత, అభినవ గాంధీ

ముఖ్యమంత్రి కేసీఆరే తన బలమని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే తన ఆత్మీయ బలగమని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు.  అంకాపూర్ గ్రామంలో  జరిగిన ఆర్మూర్ మండల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ  కేసీఆర్ గారు చావునోట్లో తలపెట్టి స్వరాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత, అభినవ గాంధీ అని అభివర్ణించారు.  ప్రజల మనసు దోచుకునేలా ఆదర్శ పాలన సాగిస్తూ అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ గారిని దేశ ప్రధానిగా చూడాలన్నదే నా జీవితాశయమన్నారు.

- Advertisement -

ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధిని అందరూ తెలుసుకోవాలి అని ఆయన ఉద్బోధించారు.  పసుపు బోర్డు తేకుండా బీజేపీ పంగనామాలు పెట్టిందని ఆయన ఆరోపించారు.  కాగా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న  బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, రజిత రెడ్డి దంపతులు ఘనంగా సత్కరించారు. సమ్మేళనానికి సతీ సమేతంగా హాజరైన పార్టీ కార్యకర్తలకు, వారి సతీమణులకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, రజిత రెడ్డి దంపతులు నూతన వస్త్రాలను పెట్టి వారి ఆశీస్సులు తీసుకున్నారు. సమ్మేళనం సందర్భంగా భోజనం ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించిన జీవన్ రెడ్డి దంపతులు.. పార్టీ కార్యకర్తలకు, వారి కుటుంబ సభ్యులకు స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, రజిత రెడ్డి దంపతులు కార్యకర్తల యోగ క్షేమలు అడిగి తెలుసుకున్నారు.

పార్టీ జిల్లా ఇంచార్జి, శాసన మండలి డిప్యూటీ స్పీకర్  బండ ప్రకాష్ ,రాజ్య సభ సభ్యులు కె ఆర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్సీ విజి గౌడ్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, టీఎస్ డబ్ల్యూ సీ డీసీ చైర్ పర్సన్ ఆకుల లలిత, మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ మధు శేఖర్, కోటపాటి నరసింహ నాయుడు, సీనియర్ నాయకుడు రాజారామ్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News