వివాదాస్పద బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై(Rajasingh) పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈ నెల 6వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా.. రాజాసింగ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. అయితే ఈ యాత్రలో డీజే సౌండ్స్ పరిమితికి మించి పెట్టారని రాజాసింగ్‌తో పాటు మరో ఇద్దరిపై కేసులు పెట్టినట్లు మంగళ్‌హట్ పోలీసులు తెలిపారు. ఇందుకోసం పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని చెప్పారు.
- Advertisement -
సౌండ్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలకు అంతరాయం ఏర్పడిందని వివరించారు. ఇక శోభాయాత్ర సందర్భంగా పోలీసులను ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు అసభ్య పదజాలంతో దూషించారన్నారు. ఎఫ్ఐఆర్‌లో రాజాసింగ్‌తో పాటు మాజీ మంత్రి ఆనంద్ సింగ్, ఎంపీ అభ్యర్థి భగవంత్ రావు పేర్లు చేర్చారు.