Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Telangana-AP: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో హైవే!

Telangana-AP: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో హైవే!

- Advertisement -

Telangana-AP: రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్-తెలంగాణలను కలుపుతూ కేంద్రం మరో జాతీయ రహదారిని నిర్మించనుంది. ఇది తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నుండి ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు వరకు 255 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. రూ. 4706 కోట్ల అంచనా వ్యయంతో ఈ హైవేను నిర్మించనున్నారు.

రహదారిలో అంతర్భాగంగా ఇప్పటికే కృష్ణా నదిపై వంతెన నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లను ఆహ్వానించింది. తెలుగు రాష్టాలను అనుసంధానం చేసేలా 255 కిమీ రహదారిని ఏడు ప్యాకేజీలుగా విభజిస్తారు. NH 157K గా పిలిచే ఈ రహదారి తెలంగాణలో 91 కిమీ, ఏపీలో 164 కిమీ గా ఉంది. ఈ రహదారికి తెలంగాణలో 91 కిమీకు గాను.. రూ.2406 కోట్లతో రూపొందించేందుకు డీపీఆర్ కూడా సిద్ధమైంది.

ఇక, ఏపీలో 164 కిమీకు గాను రూ.2300 కోట్లతో ఈ రహదారి నిర్మాణం జరగనుండగా.. నాలుగు ప్యాకేజీలుగా విభజించి నంద్యాల జిల్లా సిద్దేశ్వరం నుండి కడప జిల్లా జమ్మలమడుగు వరకు నిర్మాణం జరగనుంది. ఫిబ్రవరి మొదటి వారంలో టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టి ఏడాదిన్నరలో ఈ రహదారి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News