Friday, November 22, 2024
HomeతెలంగాణKTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు షాక్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేయాలని ఫిర్యాదు

KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు షాక్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేయాలని ఫిర్యాదు

KTR| బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) మరోసారి చిక్కుల్లో చిక్కుకున్నారు. అధికార కాంగ్రెస్ నాయకులపై ఒంటికాలు మీద విరుచుకుపడుతున్న కేటీఆర్‌పై ఆ పార్టీ ఎస్సీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే కేటీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్‌కు ఫిర్యాదుచేశారు. అసలు ఏం జరిందంటే.. ఇటీవల ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం(Ambedkar Statue) చుట్టూ కట్టిన రక్షణ గోడను కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగానే గోడను కూల్చివేశారని.. వీరి వెనక కేటీఆర్ హస్తం ఉందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -

దీంతో ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొట్టి శాంతి‌భద్రతలకు భంగం వాటిల్లేలా మాజీ మంత్రి వ్యవహరించారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు అల్లర్లకు కారణమమయ్యే అవకాశం ఉందని.. దేశ సమగ్రతను దెబ్బతీస్తాయని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా కేటీఆర్‌పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్‌తో పాటు ఆ పార్టీ కీల‌క నేత మ‌న్నె క్రిశాంక్‌, బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా వింగ్‌, కేటీఆర్ పీఏ తిరుప‌తిపై ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేయాల‌ని కోరారు.

పోలీసులకు ఫిర్యాదుచేసిన వారిలో రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు ప్రీతం, మ‌త్స్య కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ మెట్టు సాయి, తెలంగాణ ఖ‌నిజ వ‌న‌రుల అభివృద్ధి సంస్థ ఛైర్మ‌న్ ఇర‌వ‌ర్తి అనిల్ ఉన్నారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదులో కేటీఆర్ అండ్ కో‌పై పోలీసులు ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీ కేసు న‌మోదు చేస్తారా? లేదా? అనే విష‌య‌మై సర్వత్రా ఉత్కంఠ నెల‌కొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News