Friday, April 4, 2025
HomeతెలంగాణAP High Court CJ: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌

AP High Court CJ: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌

తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ పాల్గొన్నారు.

- Advertisement -

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు, శాసనమండలి డిప్యూటీ చైర్మ్‌న్‌ జకియా ఖానమ్, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీ కె వి రాజేంద్రనాథ్‌రెడ్డి, పలువులు న్యాయమూర్తులు, ఉపముఖ్యమంత్రి (పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, హోంశాఖ మంత్రి తానేటి వనిత, జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, ఇతర ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, ఉన్నతాధికారులు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌కి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు సిఎం వైఎస్‌.జగన్‌.

అనంతరం హై టీ కార్యక్రమంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, సిఎం వైఎస్‌.జగన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News