KCR Ganapathi Homam at Aravalli: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో గణపతి హోమం నిర్వహించబోతున్నారని సమాచారం. కేసీఆర్ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏటా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే… ఈసారి రాజకీయంగా ఎదురవుతున్న ఇబ్బందులు, కేసులు తొలగిపోవాలని , పార్టీలో కవిత సృష్టించి అంతర్గత విభేదాలు సర్దుమనగాలని ఈ హోమం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేసీఆర్ తన సతీమణి శోభ కలిసి ఈ పూజలో పాల్గొననున్నారు. కొంతమంది ముఖ్య నాయకులు సైతం హాజరయ్యే అవకాశం ఉంది.
హోమం ముఖ్య ఉద్దేశ్యం: తనకుఎదురవుతున్న ఇబ్బందులు, కేసులు తొలగాలని, కవిత అంశం సర్దుమనగాలని, రాజకీయంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు మెరుగుపడాలని ఈ హోమం నిర్వహిస్తున్నారని సమాచారం.
Also Read: https://teluguprabha.net/telangana-news/minister-ponnam-monitored-immersion-process-of-maha-ganesh/
గతంలోనూ హోమాలు: కేసీఆర్ కు ఆధ్యాత్మిక భక్తి ఎక్కువ. గతంలో సైతం చండీయాగం, రాజశ్యామల యాగం వంటి హోమాలు నిర్వహించారు.
ఈ గణపతి హోమంతోనైనా కవిత అంశం సర్దుమనగేనా: బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత సృష్టించి అంతర్గత విభేదాలు అంతా ఇంతా కాదు. ఏకంగా హరీష్ రావు, సంతోష్ నే టార్గేట్ చేస్తు పెట్టిన ప్రెస్ మీట్ తో బీఆర్ఎస్ తనపై వేటు వేసింది. దీంతో కవిత తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో కవిత తన రాజకీయ భవిష్యత్తుపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరదించే ప్రయత్నం చేశారు. అయినప్పటికి పార్టీలో కవిత సృష్టించి అంతర్గత విభేదాలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయ. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో గణపతి హోమం అయిన కవిత అంశం సర్దుమనగాలను బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.


