Saturday, April 5, 2025
HomeతెలంగాణAruri Ramesh: మిమ్మల్ని కడుపులో పెట్టుకు చూసుకుంటా

Aruri Ramesh: మిమ్మల్ని కడుపులో పెట్టుకు చూసుకుంటా

భారీగా చేరికలు

గ్రేటర్ వరంగల్ 3 వ డివిజన్ పైడిపల్లి స్టాలిన్ నగర్ కి చెందిన గుడిసె వాసులు సీపిఎం పార్టీ నుండి 200 మందికి పైగా బిఆర్ఎస్ పార్టీలోకి వర్ధన్నపేట నియోజకవర్గ అభ్యర్ధి అరూరి రమేష్ సమక్షంలో బిఅర్ఎస్ పార్టీలో చేరారు. గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్ చింతగట్టుకు చెందిన గౌడ కులస్తులు.. జనగాని రమేష్, రవీందర్, సారయ్య, బాలరాజు, మల్లేశం తదితరులు వారి సంపూర్ణ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా అరూరి రమేష్ మాట్లాడుతూ… కేసిఆర్ 2023 మానిఫెస్టో కి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని, అభివృద్ధి చేస్తున్న బిఅర్ఎస్ పార్టీ ని ప్రజలు ఆదరిస్తారని పార్టీలో చేరిన ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటందని అన్నారు.
పార్టీలో చేరిన వారిలో అక్కనపల్లి యాదగిరి, జన్ను చిట్టి, వీణ్, ప్రసంగి, రాజలింగం, వినయ్, సమ్మయ్య, నాగరాజు, కనకలక్ష్మి, ప్రేమలత, ఈశ్వర్, లక్ష్మీ, స్రవంతి, సీత, శ్రీశైలం, నీలమ్మ, కల్పన, సరిత రావు పార్టీలో చేరారు. స్థానిక డివిజన్ కార్పొరేటర్ జన్ను షిబా రాణి – అనిల్, నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News