Saturday, November 23, 2024
HomeతెలంగాణAsha workers: కనీస వేతనం ఇవ్వాలి: ఆశా వర్కర్ల డిమాండ్‌

Asha workers: కనీస వేతనం ఇవ్వాలి: ఆశా వర్కర్ల డిమాండ్‌

ఎమ్మెల్యే అంజయ్యకు వినతి

షాద్ నగర్ ఆశా వర్కర్ల ఇచ్చే వారితోషకం పెంచి, ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు నిర్ణయించాలని కోరుతూ ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వాలంటీర్‌ కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సర్దార్ ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మేల్యే అంజయ్యకు వినతిపత్రం అందజేశారు. తమ పనికి తగిన వేతనం ఇవ్వడం లేదని, వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎమ్మేల్యే కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్ రాజు,ఉపాధ్యక్షుడు బిసా సా యిబాబు ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రాధిక కోశాధికారి లలిత మాట్లాడుతూ.. ఆశావర్కర్లు కరోనా మహమ్మారి కాలంలో వైరస్‌ను నియంత్రించడంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. అయితే, ఆశాలకు కేవలం రూ.9,750 పారితోషికం మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. వారి పనికి తగిన వేతనాలు ఇవ్వడం లేదని, పారితోషికాలను రూ.18,000కు పెంచి ఫిక్స్‌డ్‌ వేతనం నిర్ణయించాలని కోరారు గతంతో పోలిస్తే ఆశ వర్కర్లకు పనిభారం విపరీతంగా పెరిగిందని పారితోషకంతో పాటు పారితోషకాలు లేని అనేక పనులను ప్రభుత్వం ఆశలతో చేయిస్తున్నది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సబ్ సెంటర్ బస్తీ దావాఖానాలో పనిచేయాలని ఆశలకు ప్రభుత్వం చెబుతున్నది. ఇంత పని చేస్తున్న తమకు కేవలం 9750 రూపాయలు పారితోషకం మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తున్నది ఒకవైపు పని భారం పెరిగింది మరొకవైపు నిత్యవసరదరాలు ఆకాశం నిండుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే పారితోషకాలు సరిపోక ఆశ వర్కర్లు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు.

- Advertisement -

రోజువారి రిజిస్టర్లు రాయడం సర్వేలు చేయడం ఆన్లైన్ పనిచేయడం బీపీ షుగర్ థైరాయిడ్ అన్ని రకాల జబ్బులకు గుర్తిస్తూ ప్రజల ఆరోగ్యం గురించి ముందస్తు జాగ్రత్త పరుస్తున్నారు. అయినా తమలకు కనీస వేతనం 18000 ఎందుకు ఇవ్వటం లేదని వారు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ను ప్రశ్నించారు. వెంటనే సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేనిచో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. ఆశ వర్కర్లు చేస్తున్న కార్యక్రమానికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పి శ్రీను నాయక్ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్ నాయక్ భవన నిర్మాణ కార్మిక సంఘం నియోజకవర్గ అధ్యక్షులు జంగయ్య కార్యదర్శి వెంకటేష్ ఆశా వర్కర్లకు సంపూర్ణం మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు సుజాత సునీత ఎంత లక్ష్మి సరితసుజాత వసంత శంకరమ్మ మంజుల పావని నూర్జహాన్ జయమ్మ పారిజాతం యాదమ్మ రాధిక జాంగిర్ బి కవిత లక్ష్మి మల్లీశ్వరి శ్రీలత పార్వతి రమాదేవి జ్యోతి మాధవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News