తన జన్మదినాన్ని పురస్కరించుకొని “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా శాసనసభ ఆవరణలో శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి మొక్కలు నాటారు. ఈసందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ..మానవ మనుగడకు చెట్లు జీవనాడులు అన్నారు. ఒకప్పుడు కాలుష్యకారకాలుగా ఉండే అనేక ప్రాంతాలు ఇవ్వాల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “హరితహారం”, రాజ్యసభ సభ్యలు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” తో పచ్చగా మారాయి. ఇంకా మారాల్సిన అవసరం ఉంది. మనిషి శాశ్వతం కాదు.. కానీ భవిష్యత్ తరాల బాగు కోసం చేసే ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ప్రజల హృదయంలో పదిలంగా ఉంటాయన్నారు పోచారం.