Sunday, July 7, 2024
HomeతెలంగాణAswaraopet: పత్తి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

Aswaraopet: పత్తి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

పోడు భూమి పాస్ పుస్తకాలు రాకపోవటంపై విచారణ

అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని ములకలపల్లి మండలం పాతగుండాలపాడులో పోడు భూమి పాస్ పుస్తకాలు పంపిణీ చేసి వస్తున్న సందర్భంలో రాజీవ్ నగర్ కు చెందిన గిరిజనులు పత్తి విత్తనాలు నాటుతుండగా ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు వారి వద్ద ఆగి, వారితో కలిసి పత్తి విత్తనాలు నాటారు. అనంతరం వారితో ఆత్మీయంగా మాట్లాడుతూ రైతు బంధు పడిందా అని ఎమ్మెల్యే మహిళా రైతును అడగడంతో ఆనందంగా నిన్న రాత్రి 3ఏకరాలకు 15,000/- పడ్డాయి సార్ అంటూ సమాధానం ఇచ్చింది.

- Advertisement -

పోడు భూమి పాస్ పుస్తకాలు రాని వాటి గురించి జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోతో మాట్లాడిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలువురికి సర్వే జరిగిన పోడు భూమి పాస్ పుస్తకాలు రాలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వారికి కూడా పాస్ పుస్తకాలు ఇప్పించాలని ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ మరియు ఐటీడీఏ పీవో గౌతం తో ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు పీవో మాట్లాడుతూ సర్వే జరిగి రానివి ఏవైతే ఉన్నాయో వాటిని కొద్దిరోజుల్లోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News