రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చింతగట్టు కెనాల్ దగ్గర కెఎల్ఎన్ ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన 53,54వ డివిజన్ బి అర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో సీఎం కెసిఆర్ అధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. సొంత స్థలాలు ఉన్న వారికి ఇండ్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని తెలిపారు. ఇదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ లపై మంత్రి మండిపడ్డారు. తమ పార్టీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయని పథకాలను ఇక్కడ అమలు చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలాంటి వాళ్ళ వల్లే ఇవ్వాళ అన్నిరకాల ధరలు పెరిగాయని ఎద్దేవా చేశారు. విభజన హామీలు కూడా నెరవేర్చని వారు విచిత్రంగా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే పార్టీ శ్రేణులు అలాంటి వాదనలను తిప్పి కొట్టాలని పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, బి అర్ ఎస్ లాంటి పార్టీ దేశంలోనే లేదన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఏ కారణం చేతనైనా కార్యకర్త చనిపోతే, రూ.2 లక్షల చెక్కును అందచేస్తున్న ఏకైక పార్టీ బి అర్ ఎస్ అని చెప్పారు. 80 లక్షల సైనికులుగా గల కార్యకర్తలు, మంచి సమర్థవంతమైన, అనుభవం గల, యువ నాయకత్వం మన బలం అన్నారు. సీఎం కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉందన్నారు. మంత్రి ఎర్రబెల్లి నాయకత్వంలో పల్లెలు బాగుపడ్డాయని, అవార్డులు వస్తున్నాయని చెప్పారు. ఇలాంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.