హీరో మంచు మనోజ్‌పై దాడి చేసిన కేసులో మంచు విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం తనపై దాడి చేశారని మనోజ్ పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. జల్‌పల్లిలోని తండ్రి మోహన్ బాబు నివాసంలో తనపై దాడి చేయడమే కాకుండా సీసీటీవీ ఫుటేజ్‌ను మాయం చేశారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.
- Advertisement -
మనోజ్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న కిరణ్‌ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు వినయ్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు. అలాగే మోహన్ బాబు ఇంటి వద్ద మాయమైన సీసీ ఫుటేజ్‌పై పోలీసులు విచారణ జరుపుతున్నారు.