అభివృద్ధి, సంక్షేమానికి అసలైన నిర్వచనంగా ఆవిష్కృతమైన తెలంగాణ మోడల్ మహారాష్ట్ర ప్రజలను అమితంగా ఆకర్షిస్తోంది. ఫలితంగా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి విశేష ఆదరణ లభిస్తూ కేసీఆర్ నాయకత్వం పట్ల విశ్వాసం వ్యక్తమవుతోంది. దీంతో నిత్యం బీఆర్ఎస్ లోకి చేరికల పరంపర కొనసాగుతోంది. గులాబీ గూటికి చేరడానికి పలు పార్టీలు, ప్రజా సంఘాల నేతలు లైన్లు కడుతున్నారు. ఈరోజు ఛత్రపతి శంబాజీనగర్ (ఔరంగాబాద్) పట్టణంలో బీఆర్ఎస్ మహాసభ జరుగనుంది. ఈసభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఔరంగాబాద్ లోని జబిందా మైదానంలో జరగనున్న బీఆర్ఎస్ సభకు సర్వం సన్నద్ధమైంది. ఈ సభలో తెలంగాణ మోడల్ పై కేసీఆర్ ప్రసంగం వినడానికి మహారాష్ట్ర ప్రజల్లో ఆసక్తి కనపడుతోందన్నారు జీవన్ రెడ్డి. ఈ సభకు 2 లక్షల మందికి పైగా వస్తారని అంచనా వేస్తూ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు. కేసీఆర్ సభ ఔరంగబాద్ చరిత్రలోనే అతిపెద్ద సభగా రికార్డ్ సృష్టిస్తుందని జీవన్ రెడ్డి వెల్లడించారు.