Saturday, April 12, 2025
HomeతెలంగాణAwards: పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కి అవార్డులు

Awards: పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కి అవార్డులు

ఉత్తమ ప్రతిభ కనబరిచిన కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల అవార్డుల ప్రదానం

పోచంపల్లి మండలంలోని పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఈనెల 14న B2B ఇన్ఫో మీడియా వారి ఆధ్వర్యంలో 7వ అఖిలభారత కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల సమ్మేళనం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నిర్వహించారు. ఈ సమ్మేళనంలో 2023 సంవత్సరానికి ఉత్తమ ప్రతిభ కనబరిచిన కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల అవార్డుల ప్రదానం చేశారు. ఈ అవార్డులో ప్రదానోత్సవంలో మన పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు రెండో అవార్డులు గెలిచారు.

- Advertisement -

సీత శ్రీనివాస్ బెస్ట్ సీఈఓ ఆఫ్ ది ఇయర్ 2023, బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డులను సొంతం చేసుకుంది. B2B ఇన్ఫో మీడియా ప్రతినిధుల నుండి అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్నాటి వెంకట బాలసుబ్రమణ్యం, సీఈవో సీత శ్రీనివాస్ అందుకున్నారు. బ్యాంకు రెండు అవార్డులు గెలుచుకోవడం పట్ల బ్యాంకు వైస్ చైర్మన్ సురపెళ్లి రమేష్ డైరెక్టర్లు శ్రీధర్ దామోదర్, భోగ విజయ్ కుమార్, చిక్క కృష్ణ, పున్న లక్ష్మీనారాయణ, కొండమడుగు ఎల్ల స్వామి, కడివేరు కవిత, పిల్లలమర్రి అర్చన, రాపోలు వేణు, బిట్టు భాస్కర్ బ్యాంకు వ్యవస్థాపకులు గత పాలకవర్గ సభ్యులు ఖాతాదారులు వాటాదారులు బ్యాంకు వివిధ శాఖల మేనేజర్లు సిబ్బంది పుర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News