హీరో అల్లు అర్జున్(Allu Arjun) ఇంటిపై దాడి చేసిన నిందితులకు బెయిల్ లభించింది. ఆరుగురు నిందితులను వనస్థలిపురంలోని న్యాయమూర్తి నివాసంలో జూబ్లీహిల్స్ పోలీసులు హాజరుపరిచారు. దీంతో వారికి న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ఒక్కొక్కరు రూ.10వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించారు.
కాగా ఆదివారం సాయంత్రం అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇంటి గోడలు ఎక్కి రాళ్లు రువ్వడంతో పాటు గేటు లోపలికి దూసుకెళ్లి పూలకుండీలు ధ్వంసం చేశారు. అనంతరం ఇంటి ముందు భైఠాయించి నిరసన చేపట్టారు. రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని నినాదాలు చేస్తున్నారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆరుగురు జేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.
దాడి చేసిన వారిని జేఏసీ అధికార ప్రతినిధి బోనాల నాగేశ్ మాదిగ, ఛైర్మన్ రెడ్డిశ్రీను ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్, కన్వీనర్ పి.ప్రకాశ్, నాయకుడు సి.మోహన్, NSUI రాష్ట్ర కార్యదర్శి బుద్దా ప్రేమ్‌కుమార్‌గౌడ్, పి.ప్రకాశ్‌గా గుర్తించారు. నిందితులపై BNS 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ దాడిని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(KomatiReddy Venkat Reddy) తీవ్రంగా ఖండించారు.