Sunday, November 16, 2025
HomeతెలంగాణBalapaur Laddu: బాలాపూర్ లడ్డూ 27 లక్షలు

Balapaur Laddu: బాలాపూర్ లడ్డూ 27 లక్షలు

బాలాపూర్ లడ్డూకు సాటిరాదు ఏదీ

ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణేష్ లడ్డూ ఏ ఏడాది 27 లక్షలు పలకటం విశేషం. గతేడాది కంటే ఈ లడ్డూ ధర 2.40 లక్షలు అధికంగా పలకటం మరో విశేషం. తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద్ రెడ్డి ఈ ఏడాది వేలంపాటలో లడ్డూ సొంతం చేసుకున్నారు.  వేలంపాటలో లడ్డు గెలుపొందినవారు స్థానికులైతే మరుసటి ఏడాది, స్థానికేతరులైతే అప్పటికప్పుడు డబ్బు చెల్లించేలా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి నిబంధన విధించింది. గత 30 ఏళ్లుగా హైదరాబాద్ సమీపంలోని బాలాపూర్ గణేష్ విగ్రహాన్ని అత్యధిక ధరకు, వేలంపాటలో సొంతం చేసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఉత్సాహం చూపిస్తూవస్తున్నారు. ఇక్కడి లడ్డూ సొంతం చేసుకుంటే తమకు ఆర్థికంగా బ్రహ్మాండంగా కలిసివస్తుందనే సెంటిమెంట్ జోరుగా ఉండటమే ఇందుకు కారణం. ఇక బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాటు తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad