Saturday, November 15, 2025
HomeతెలంగాణBalapur Laddu: తొలిసారి బాలాపూర్‌ లడ్డు ధర తెలిస్తే.. అవాక్కవాల్సిందే!

Balapur Laddu: తొలిసారి బాలాపూర్‌ లడ్డు ధర తెలిస్తే.. అవాక్కవాల్సిందే!

Balapur Laddu Auction 2025: బాలాపూర్‌ గణేశుడు లడ్డు వేలం రికార్డు స్థాయి ధరతో ప్రత్యేక గుర్తింపు పొందింది . ఈసారి ఏకంగా రూ. 35 లక్షల ధర పలికింది. లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి దక్కించుకున్నారు. అయితే బాలాపూర్ లడ్డూ వేలం ఎప్పుడు మెుదలైంది?. ఎవరు తొలిసారిగా లడ్డును దక్కించుకున్నారు?. ఎంతకు దక్కించుకున్నారు?. అసలు ఈ లడ్డుకు ఇంత భారీ ధర పెట్టడానికి కారణాలేంటనే విషయాలను తెలుసుకుందాం.

- Advertisement -

లడ్డు వారింట కొంగుబంగారం: భాగ్యనగరంలో బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాటకు ఘనమైన చరిత్ర ఉంది. లంబోదరుడి చేతిలో పూజలు అందుకున్న లడ్డును దక్కించుకుంటే… వారి ఇంట సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. బాలాపూర్‌లో తొలిసారిగా 1980లో గణేశుడి విగ్రహ ప్రతిష్టాపన జరిగిందని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. 1994లో మొదటిసారి లడ్డూ వేలం నిర్వహించినట్లు తెలిపారు. తొలి వేలం పాటలో రూ.450కి స్థానిక వ్యక్తి కొలను మోహన్​రెడ్డి దక్కించుకున్నారు. మెుదటిసారి 1994లో లడ్డు పొందిన కొలను మోహన్​రెడ్డి తన కుటుంబసభ్యులకు ఇవ్వడంతో పాటుగా… వ్యవసాయ క్షేత్రంలో చల్లారు. వారికి ఆ ఏడాది అన్ని పనుల్లోనూ మంచి జరిగింది. లడ్డు వారింట కొంగుబంగారం అయ్యింది. బాలాపూర్ లడ్డూ పొందడం ద్వారానే కలిసొచ్చిందని వారి నమ్మకం.

Also Read:https://teluguprabha.net/telangana-news/balapur-ganesh-laddu-auctioned-for-record-rate-in-hyderabad/

 

9సార్లు కొలను వంశస్తులకే ఆ మహా ప్రసాదం: 1994లో రూ.450తో మొదలైన లడ్డూవేలం పాట… వందలు, వేలు దాటి లక్షల్లో పలుకుతోంది. 2001 వరకు బాలాపూర్ గణపతి లడ్డూ వేలల్లోనే పలికింది. కానీ 2002లో కందాడ మాధవరెడ్డి పోటీపడి రూ.1,05,000కు లడ్డూ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఒక్కోక్క లక్ష పెరుగుతూనే ఉంది. 2007లో స్థానికుడు రఘునందనచారి 4,15,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. 2015లో బాలాపూర్ గణపతి లడ్డూ రూ.10 లక్షలు దాటి రికార్డు సృష్టించింది. కల్లెం మదన్ మోహన్‌రెడ్డి అనే వ్యక్తి రూ.10,32,000 లకు లడ్డూను దక్కించుకున్నారు. కాగా ఇప్పటివరకు జరిగిన బాలాపూర్‌ వేలంలో అత్యధికంగా 9 సార్లు కొలను వంశస్తులే దక్కించుకోవటం గమనార్హం. గతేడాది 2024 లో రూ.30.01 లక్షలకు కొలను కుంటుంబం మళ్లీ లడ్డూను దక్కించుకుంది.

బాలాపూర్ లడ్డూ వేలం విన్నర్స్​ లిస్ట్​ :

క్రమ సంఖ్య లడ్డూ విజేత వేలం పాట సంవత్సరం వేలం ధర (రూ.)
01   కొలను మోహన్​రెడ్డి    1994      450
02   కొలను మోహన్​రెడ్డి    1995      4,500
03   కొలను కృష్ణా రెడ్డి      1996      18,000
04   కొలను కృష్ణా రెడ్డి      1997      28,000
05   కొలను మోహన్​రెడ్డి    1998      51,000
06   కళ్లెం అంజి రెడ్డి        1999     65,000
07   కళ్లెం ప్రతాప్ రెడ్డి       2000     66,000
08   జీ రఘునందన్ చారి   2001     85,000
09   కందాడ మాధవ రెడ్డి    2002    1,05,000
10   చిగిరింత బాల రెడ్డి     2003     1,55,000
11   కొలను మోహన్​రెడ్డి     2004     2,01,000
12   ఇబ్రామ్ శేఖర్            2005     2,08,000
13   చిగిరింత తిరుపతి రెడ్డి   2006    3,00,000
14   జీ రఘునందన్ చారి     2007     4,15,000
15   కొలను మోహన్​రెడ్డి       2008     5,07,000
16   సరిత                        2009    5,10,000
17   కొడాలి శ్రీధర్ బాబు                   2010  5,35,000
18   కొలను బ్రదర్స్                        2011   5,45,000
19   పన్నాల గోవర్ధన్ రెడ్డి                 2012   7,50,000
20   తీగల కృష్ణా రెడ్డి                       2013   9,26,000
21   సింగిరెడ్డి జైహింద్ రెడ్డి               2014    9,50,000
22   కళ్లెం మదన్ మోహన్ రెడ్డి           2015    10,32,000
23   కందాడి స్కైలాబ్ రెడ్డి               2016    14,65,000
24   నాగం తిరుపతి రెడ్డి                  2017    15,60,000
25   తేరేటిపల్లి శ్రీనివాస్ గుప్            2018    16,60,000
26   కొలను రామ్ రెడ్డి                     2019    17,60,000
27   నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2020 కరోనా కారణంగా వేలం నిర్వహించలేదు
28  రమేశ్​ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డి 2021   18,90,000
29  వంగేటి లక్ష్మా రెడ్డి               2022         24,60,000
30  దాసరి దయానంద రెడ్డి        2023         27,00,000
31  కొలను శంకర్ రెడ్డి              2024         30,01,000
32  లింగాల దశరథ్ గౌడ్           2025         35,00,000

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad