Saturday, November 23, 2024
HomeతెలంగాణBalka Suman: చెన్నూర్ నియోజకవర్గం అభివృద్ధిపై ప్రభుత్వ విప్ టెలి కాన్ఫరెన్స్

Balka Suman: చెన్నూర్ నియోజకవర్గం అభివృద్ధిపై ప్రభుత్వ విప్ టెలి కాన్ఫరెన్స్

ఈనెల ఏప్రిల్ 11,12వ తేదీల్లో నిర్వహించిన చెన్నూరు, జైపూర్ మండలాల ఆత్మీయ సమ్మేళనాలలో భాగంగా గ్రామపంచాయతీల వారిగా ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ క్యాతన్ పల్లి మున్సిపాలిటీపరిధిలోని తన నివాస కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశాల్లో గ్రామాల వారీగా లేవనెత్తిన అంశాలపై చెన్నూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల ఎమ్మార్వో, ఎంపీడీ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎమ్.పి.డీ.ఓ లతో మాట్లాడుతూ… ఆయా మండలాల పరిధిలో నిర్మించనున్న సమ్మక్క- సారలమ్మ మహిళా భవనాలు, కేసీఆర్ గ్రంధాలయాలకు స్థల సేకరణ వేగవంతం చేసి వాటి నిర్మాణాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.

- Advertisement -

గ్రామాల్లో నిర్మించిన పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణాల్లో ఓపెన్ జిమ్స్, త్రాగునీరు, లైట్లు వంటి వసతులను కల్పించాలి. గ్రామాల్లో నిర్మించనున్న అంతర్గత రోడ్లు, గోదావరి నది వైపు ఉన్నా దారి మార్గం వెళ్లేందుకు బాటలు వేయాలి సూచించారు. ఐదు మండలాల పరిధిలో ఉన్న గిరిజన గ్రామాలను గుర్తించాలి. భీమారం మండలంలో గిరిజన భవనం నిర్మాణానికి స్థల సేకరణ చేయాలని భీమారం ఎమ్మార్వో ను ఆదేశించారు. చెన్నూరు నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం నిర్వహించే “స్వచ్ఛ శుక్రవారం” లో ప్రజలతోపాటు గ్రామ పరిధిలో గల అధికారులు విధిగా పాల్గొనాలన్నారు. ప్రతి శుక్రవారం గ్రామాలు, వార్డుల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం, మురుగు కాల్వలు శుభ్రపరచడం, పరిసరాలను పరిశుభ్రంగా చేయడం, ఎవెన్యూ ప్లాంటేషన్‌, నర్సరీ, పిచ్చి మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవడం, విద్యుత్ దీపాలకు సంబంధించిన నిర్వహణ తదితర పనులను నిర్వహించాలి.

విద్యుత్ స్థంభాలకు వ్రేలాడే విద్యుత్ తీగలు, ఇండ్ల మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ఫీడర్ల మెయింటెనెన్స్ విద్యుత్ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ సమస్యలను పరిష్కరించాలి. వేసవి దృష్ట్యా మిషన్ భగీరథ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మార్వోలతో మాట్లాడుతూ… గ్రామాల్లో ఉన్న రైతులు మరియు రెవెన్యూ, రైతులు మరియు అటవీ, రెవిన్యూ మరియు అటవీ శాఖ మధ్య ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. కోర్టు పరిధిలో ఉన్న భూములను తప్ప, గ్రామ పరిధిలో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ భూముల వివరాలను సేకరించాలి. గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను సర్వే చేయాలి, ప్రభుత్వ పరంగా నిర్వహించనున్న పలు నిర్మాణాలకు ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని రైతులకు భూ సమస్యలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. జీవో 76 లో భాగంగా రామకృష్ణాపూర్ పట్టణంలో అందరూ ఇండ్ల పట్టాలకు అప్లై చేసుకునేలా చూడాలన్నారు. ఇప్పటికే అప్లై చేసి డీడీలు తీసిన వారికి వీలైనంత తొందరలో ఇండ్ల పట్టాలు అందేలా చూడాలన్నారు. జీవో 76 మరో మూడు నెలలు పొడగించిన నేపథ్యంలో పట్టణవాసులందరూ ఈ సదా అవకాశాన్ని వినియోగించుకోవాలని విప్ బాల్క సుమన్ సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News