కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువతకు రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని ఈ పోటీల్లో మహబూబ్ నగర్, దేవరకద్ర,జడ్చర్ల నియోజకవర్గం లో ఉన్న వాళ్ళు పాల్గొని తమ టాలెంట్ ను పరీక్షించుకోవాలని ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ కోరారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకట్ మాట్లాడుతూ…..ఈ పోటీలు ఆస్కార్ అవార్డు విన్నర్ రాహుల్ సింప్లి,పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే విద్యార్థులు 18 సంవత్సరాలు పైబడిన వారు ఉండాలని పాల్గొన్న విద్యార్థులు యువతకు గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఈ పోటీలు మార్క్ టెస్ట్ విధంగా ఉపయోగ పడుతుందని తెలిపారు. ఈ సిలబస్ లో ముఖ్యంగా రాజీవ్ గాంధీ, టెక్నాలజీ గురించి, తెలంగాణ ఉద్యమం, జనరల్ నాలెడ్జ్ గురించి ఉంటుందని తెలిపారు.
ఈ ఆన్లైన్ క్విజ్ పోటీల్లో 60 నిమిషాల్లో 60 కొషన్లు ఉంటాయని దీంట్లో బిఆర్ఎస్ పార్టీ విధంగా పేపర్ లీకేజ్ వంటిది ఉండదని పేర్కొన్నారు. ఈ క్విజ్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు నియోజకవర్గానికి 44 మందిని సెలెక్ట్ చేసి వారికి బహుమతులు అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని మిగిలిపోయిన విద్యార్థులందరికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ లో పొందపరచిన విధంగా నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లాంటి పథకాలు ఈ డేటా ప్రకారం అమలు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం స్థానిక మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురించి మాట్లాడుతూ స్థానిక మంత్రికి విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే స్థానికంగా ఉన్న పియు కళాశాలలో స్టాఫ్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే యూనివర్సిటీని తనిఖీ చేసి వారి సమస్యలు పరిష్కరించకుండా సభలలో విద్యార్థులకు ఏదో చేశామని గొప్పలు మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉద్దేశం ఉంటే మంత్రి ఒకసారి స్థానిక పియు కళాశాలలో సమావేశం ఏర్పాటు చేసి అక్కడ విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని సమస్యలు పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ తో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించాలని సూటిగా ప్రశ్నించారు. ఇవేవి చేయకుండా వ్యక్తిగత లాభాల కోసం నిరుద్యోగులు కలగన్న తెలంగాణలో వారి కలలు,ఆకాంక్షలను తుంగలో తొక్కి వారి జీవితాలతో చెలగాటమాడుతూ ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎన్ ఎస్ యు ఐ చూస్తూ ఊరుకోదని సైనికుల్లా అడుగడుగునా అడ్డుకొని నిరసనసగా రేపుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షుడు అవేజ్, రాష్ట్ర కార్యదర్శి ముకుందం రమేష్, జిల్లా కార్యదర్శి పురుషోత్తం, ఇతర జిల్లాలు, మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.