Monday, March 24, 2025
HomeతెలంగాణBandi Sanjay: తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం: బండి సంజయ్

Bandi Sanjay: తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం: బండి సంజయ్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల(Delhi Election Results) పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారని ఎద్దేవా చేశారు. కుంభకోణాలు, జైలుకు వెళ్లే పార్టీలు తమకొద్దని ప్రజలు అనుకున్నారని తెలిపారు. దేశ రాజధానిలో కాషాయ జెండా ఎగురుతుందని తాము ముందే ఊహించినట్లు పేర్కొన్నారు. మేధావులంతా బీజేపీకి ఓట్లు వేశారన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. రాష్ట్రంలోని మేధావి, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పూర్తి మోజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థులు 45కు పైగా స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాల్లో లీడ్‌లో ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేదు. దీంతో ఢిల్లీలో బీజేపీ పాగా వేయడం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News