Saturday, November 15, 2025
HomeTop StoriesTelangana: సీఎం వ్యాఖ్యలపై బండి సంజయ్ ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్!

Telangana: సీఎం వ్యాఖ్యలపై బండి సంజయ్ ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్!

Bandi Sanjay Demand Apology From CM: కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. సీఎం వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ట్వీట్ చేశారు. జూబ్లీహిల్స్‌లో భారత్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్ మనపై దాడి చేసింది .. కానీ భారత్ స్పందించలేదని రేవంత్ రెడ్డి అనడం యావత్ దేశ గౌరవాన్ని దెబ్బతీయడమేనని సంజయ్ మండిపడ్డారు. సీఎం వ్యాఖ్యలు పాకిస్థాన్‌లో ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసిన మన సైనికుల ధైర్యసాహసాలకే అవమానం అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

ప్రధాని మోదీ కఠిన చర్యకు ప్రతీక ‘ఆపరేషన్ సింధూర్’: భారతదేశంలోని ప్రతి వీధి మన జవాన్ల సాహసంపై గర్వంతో నిండి ఉందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోందని తెలిపారు. ఇది ఉగ్రవాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కఠిన చర్యకు ప్రతీక అని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

బేషరతుగా క్షమాపణ చెప్పాలి: భారత ప్రజలకు, దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన సైనికులకు సీఎం రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ గట్టిగా డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad