Saturday, April 5, 2025
HomeతెలంగాణBandi Sanjay: టీటీడీ ఛైర్మన్‌కు బండి సంజయ్ లేఖ

Bandi Sanjay: టీటీడీ ఛైర్మన్‌కు బండి సంజయ్ లేఖ

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు(BR Naidu) కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) లేఖ రాశారు. 2023లో కరీంనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతి లభించిందని గుర్తుచేశారు. అదే ఏడాది మే 31న 10 ఎకరాల్లో భూమి పూజ కూడా జరిగిందని లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఆలయం నిర్మాణం దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని తెలిపారు. టీటీడీ నిర్మించే ఆలయం కోసం కరీంనగర్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల భక్తులు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆలయ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -

ఇక ధూప, దీప, నైవేద్యాలకు నోచుకోని అనేక దేవాలయాలను టీటీడీ ఆదుకోవడం గొప్ప విషయమని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా ధర్మ ప్రచారం చేయడంతో పాటు, హిందూ దేవాలయాల నిర్మాణానికి టీటీడీ ఎంతో కృషి చేస్తోందని ఆయన కొనియాడారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News