Bandi Sanjay| కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మానవత్వం చాటుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం సింగాపూరం సమీపంలో ఓ యువతి రోడ్డు ప్రమాదంలో లారీ కింద ఇరుక్కుపోయింది. అదే సమయంలో ములుగు పర్యటనకు వెళ్తున్న బండి సంజయ్.. ఈ ప్రమాదాన్ని గుర్తించి తన కాన్వాయ్‌ను ఆపారు. అనంతరం లారీ టైర్ కింద ఆమె డ్రెస్, జుట్టు ఇరుక్కోవడంతో వాటిని కత్తిరించి యువతిని స్థానికుల సహాయంతో బయటకు తీశారు.
అనంతరం తీవ్ర గాయాలతో ఉన్న ఆ యువతిని కరీంనగర్‌లోని లైఫ్ లైన్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. యువతి చికిత్సకు అయ్యే ఖర్చును తానే చెల్లిస్తానని వైద్యులకు తెలిపారు. కాగా లారీ కింద ఇరుకున్న యువతిని మానకొండూర్ మండలం ఖెల్లడ గ్రామానికి చెందిన దివ్య శ్రీగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.