గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja singh)పై కేంద్ర మంత్రి బండి సంజయ్( Bandi Sanjay ) సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మానికి ఆదర్శమైన వ్యక్తి రాజాసింగ్ అంటూ కామెంట్స్ చేశారు. ఆయన లాంటి నేతకు సాటి ఎవరూ లేరు అంటూ కితాబు ఇచ్చారు. అలాగే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై కూడా క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ఈ పదవిని భర్తీ చేస్తారని వెల్లడించారు. ఈ విషయం బీజేపీ పెద్దల చేతిలో ఉందని వ్యాఖ్యానించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో బయట జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అధ్యక్ష పదవికి అందరూ అర్హులేనని స్పష్టం చేశారు. ఎవరి వల్ల పార్టీకి లబ్ధి జరిగితే… వాళ్లను అధ్యక్షుడిని చేస్తారని చెప్పుకొచ్చారు. త్వరలోనే తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని జోస్యం చెప్పారు. కాగా ఇటీవల పార్టీ సీనియర్ నేతలపై రాజాసింగ్ అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ రాజాసింగ్‌పై ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది.