గ్రూప్-1 పరీక్షల వివాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు. పరీక్షల నిర్వహణ తీరుపై వారం రోజుల్లోగా సమగ్ర సమాచారం అందించాలని కోరుతూ టీజీపీఎస్సీ(TGSPC) చైర్మన్ బుర్రా వెంకటేశంకు లేఖ రాశారు. అభ్యర్థులు లేవనెత్తిన ప్రధాన సందేహాలు, ఆరోపణలను లేఖలో ప్రస్తావించారు.
- Advertisement -
కాగా గ్రూప్-1 పరీక్షల ప్రక్రియలో అవకతవకలు, లోపాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ అభ్యర్థులు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంలో జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు బండి సంజయ్‌ని కోరారు. ఈమేరకు ఆయన టీజీపీఎస్సీ ఛైర్మన్‌కు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ లేఖపై ఇప్పటివరకు కమిషన్, ఛైర్మన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.