Sunday, July 7, 2024
HomeతెలంగాణBandla Ganesh: హరీష్, కేటీఆర్ ఇంతగా ఆగం అయితారెందుకో?

Bandla Ganesh: హరీష్, కేటీఆర్ ఇంతగా ఆగం అయితారెందుకో?

మా పప్పులు, బిర్యానీ అన్నీ ఉడుకుతాయి

కాంగ్రెస్ సీనియర్ నేత బండ్ల గణేష్ గాంధీభవన్ లో ప్రెస్ మీట్ పెట్టి, కేటీఆర్, హరీష్ రావు మీద నిప్పులు చెరిగారు. అసలు హరీష్, కేటీఆర్ ఎందుకు ఆగం అయితుర్రో అర్థం అయితాలేదని బండ్ల తనదైన స్టైల్ లో కామెంట్స్ చేయటం విశేషం. నిన్నటితో ప్రజాపాలన 30 రోజులు పూర్తి చేసుకుందని, అన్ని రాష్ట్రాలు మెచ్చుకునే విధంగా ప్రజాపాలన జరుగుతోందని బండ్ల అన్నారు. ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి , మంత్రులు ప్రజాపధం వైపుకు దూసుకుపోతున్నారని, మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ కు ఈర్ష పిక్ స్టేజ్ కి చేరుకుందని బండ్ల ఆరోపించారు.

- Advertisement -

వందరోజుల తర్వాత మా పప్పులు ఉడకడం కాదు బిర్యాని కూడా ఉడుకుతుంది హరీష్ రావ్ అంటూ హెచ్చరించిన ఆయన, ఈ పది సంవత్సరాలు ఏం చేశారు హరీష్ రావు తెలంగాణకి రావలసిన హామీలపై ఏమైనా కేంద్రంతో కొట్లాడారా అంటూ బీఆర్ఎస్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రధానమంత్రి , కేంద్ర మంత్రులతో మాట్లాడుతూ తెలంగాణకి రావలసిన నిధులు పోరాటం చేస్తున్నారని, అవినీతి అధికారులను పక్కకు తప్పుంచి నిజాయితీ అధికారులను నియమించుకొని పరిపాలన చేస్తున్నారు మా ముఖ్యమంత్రి అంటూ బండ్ల నొక్కి చెప్పటం విశేషం.

పార్లమెంటు ఎన్నికల్లో మీరు ఒక్క స్థానం కూడా గెలవరంటూ ఘాటుగా హెచ్చరించిన బండ్ల, రాష్ట్రపతి వస్తే స్వాగతం పలకడానికి కూడా మీ ముఖ్యమంత్రి వెళ్లలేదని బనాయించారు. మాజీ రాష్ట్రపతి వస్తే మా ముఖ్యమంత్రి వెళ్లారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులో ఉందని చెప్పుకొచ్చారు. ఏ సమస్య ఉన్న ప్రజలు సచివాలయంకి వెళ్తున్నారని, హరీష్ రావు , కేటీఆర్ ఎందుకు ఇంతగా ఆగం అవుతున్నారని బండ్ల అన్నారు. ప్రగతి భవన్ని మా దళిత ఉప ముఖ్యమంత్రికి ఇచ్చారని బండ్ల గణేష్ సగర్వంగా చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News