Sunday, July 7, 2024
HomeతెలంగాణBanoth Kavitha: వరద బాధితులను పరామర్శించిన ఎంపీ

Banoth Kavitha: వరద బాధితులను పరామర్శించిన ఎంపీ

ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల అర్పణపల్లి గ్రామంలో ఉదృతంగా ప్రవహిస్తున్న మున్నెరు వాగు వరద నేటితో వడ్డెర కాలనీలోని నివాసలన్నీ నీట మునగగా ఆదివారం మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత దాదాపుగా 45 కుటుంబాల ఇంటింటికి తిరిగి వారితో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకుని నిత్యవసర వస్తువులు (బియ్యం,పప్పు ,వంటనూనె ,కారం ,పసుపు,పంచదార) పంపిణీ చేసారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు తమకు పక్క ఇండ్లు(డబల్ బెడ్ రూమ్ ) మంజూరు చేయించాలని కోరగా తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఇండ్లు సరిగా లేని వారిని పరిగణనలోకి తీసుకొని తప్పనిసరిగా ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే కేసముద్రం నుండి గూడూరు వెళ్లే రహదారిలో ఉప్పర పల్లి, అర్పణ పల్లి గ్రామాల మధ్యలో వట్టి వాగు పైన హై లెవెల్ వంతెన నిర్మించేలా కృషి చేయాలని ప్రతి సంవత్సరం వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని విద్యార్థులు, రైతులు, వ్యాపారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, శాశ్వత పరిష్కారం చూపించాలని ఎంపీ కవితను కోరి, వినతి పత్రం అందజేశారు.

- Advertisement -

కవిత స్పందిస్తూ తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. ఈ కర్యక్రమంలో స్థానిక సర్పంచ్ గంధసిరి స్వరూప సోమయ్యా, ఉప సర్పంచ్ గంధసిరి రాజేష్ గౌడ్,కేసముద్రం గ్రామ సర్పంచ్ బట్టు శ్రీనివాస్,ఉప్పరపల్లి సర్పంచ్ సారయ్య,MPTC సునీత, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ మరి నారాయణ,షేక్ జానీ, సంతోష్, మోడెం రాజు, బాబూరు ఉప్పలయ్య, భరత్ గౌడ్, మోగిలి, శ్రీనివాస్, పర్కాల శ్రీనివాస్ రెడ్డి, ముత్యం వెంకన్న గౌడ్, జడ్పీ.కో ఆప్షన్ మహబూబ్ పాషా, బిర్రు వెంకన్న, సట్ల వెంకన్న, తుంపిల్ల వెంకన్న పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News