తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని 6వ రోజు సాగునీటి దినోత్సవ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జమండ్లపల్లి మున్నేరు వాగు చెక్ డ్యాం వద్ద నీటిపారుదల శాఖ అధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా మహబూబాబాద్ శాసనసభ్యులు
బానోత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మున్నూరు వాగు వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, నేడు రాష్ట్రంలో ఉన్న వాగులు, వంకలు చెరువులు పొంగిపొర్లుతున్నాయని ఎండాకాలంలో కూడా నీళ్లు పుష్కలంగా ఉన్నాయంటే అది సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు వల్లే అని, భూగర్భంలో నీరు కేవలం 10 ఫీట్ల లోతునే ఉందని రైతులకు రెండు పంటలకు సరిపోను నీరు అందిస్తూ ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన గొప్పతనం సీఎం కేసీఆర్ దే అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండి ఫరీద్, కౌన్సిలర్లు మార్నేని వెంకన్న, చిట్యాల జనార్ధన్, బండి ఇందిరా వెంకన్న, అంబాల జ్యోత్స్నా శివ, బత్తుల సరస్వతి సారయ్య, నాయకులు మార్నేని రఘు, కర్పూరపు గోపి, డౌలగర్ శంకర్, భారాస నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Banoth Sankar Nayak: రైతు సమస్యకు పరిష్కారం చూపిన ఘనత కేసిఆర్ దే
ఎండాకాలంలో కూడా నీళ్లు పుష్కలంగా ఉన్నాయంటే అది సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు వల్లే