మహబూబాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కొరకు మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని 01వ వార్డు ఈదులపూసపల్లి గ్రామంలో నిర్వహించిన బూత్ కమిటీ సమావేశంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ శంకర్ నాయక్ పాల్గొని బూత్ సభ్యులకు కార్యకర్తలకు ఎన్నికలలో అనుసరించ వలసిన విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ డా. రామ్మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు, కౌన్సిలర్ మార్నేని వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షులు గద్దె రవి, యూత్ అధ్యక్షులు యాళ్ల మురళీధర్ రెడ్డి, ఇంచార్జ్ సుధగాని మురళి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.