Sunday, December 8, 2024
HomeతెలంగాణBansuvada: ముగిసిన చాతుర్మాస్య దీక్షలు

Bansuvada: ముగిసిన చాతుర్మాస్య దీక్షలు

చాతుర్మాస దీక్ష..

కాశీలో చతుర్మాస్య దీక్షలు ముగించుకొని దండి స్వామీజీ బాన్సువాడ పట్టణానికి విచ్చేస్తున్నట్లు ఆయన అభిమానులు ఓ ప్రకటన తెలిపారు. బాన్సువాడ దండి సుదర్శన పీఠాధిపతి శ్రీ సుదర్శన దండి స్వామిజీ ఆధ్వర్యంలో ఆషాడ శుద్ద పౌర్ణమి జులై నెలలో కాశీ క్షేత్రంలో ప్రారంభించి మూడు నెలల అనంతరం సెప్టెంబర్ 18 న దీక్షలు ముగించారు.
దీక్ష తీసుకొని మూడోసారి చాతుర్మాస దీక్ష ముగించుకొని తిరిగి బాన్సువాడ వస్తున్నరు. కాశీ దండి సుదర్శన స్వామీజీ కాశీలో కాశీ విశ్వేశ్వరుని సన్నిధానంలో మూడోసారి చాతుర్మాస చేసి దిగ్విజయంగా తిరిగి బాన్సువాడకు రావడం స్వామీజీ శిష్యులందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్వామీజీ దర్శనం లేక నాలుగు నెలలు అవుతుందని శిష్యులందరూ ఆనందంతో స్వామిజీకి స్వాగతం పలకాలని స్వామీజీ ముఖ్య అనుచరులు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News