Wednesday, September 18, 2024
HomeతెలంగాణBansuvada: "తెలంగాణ గిరిజనోత్సవం" లో పోచారం

Bansuvada: “తెలంగాణ గిరిజనోత్సవం” లో పోచారం

రాష్ట్రంలోని 1.50 లక్షల మంది గిరిజన రైతులకు నాలుగు లక్షలకు పైగా ఎకరాల పోడు భూములకు చెందిన పట్టాలు అందుతాయి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో జరిగిన “తెలంగాణ గిరిజనోత్సవం” లో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బాన్సువాడ, బోధన్ RDO లు రాజా గౌడ్, రాజేశ్వర్, ప్రజాప్రతినిధులు, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, మోహన్ నాయక్, బద్యా నాయక్, పెర్క శ్రీనివాస్, మాజీద్, విఠల్‌, ప్రతాప్ సింగ్, స్థానిక నాయకులు, అధికారులు, బంజారాలు పాల్గొన్నారు.

- Advertisement -

ఈసందర్భంగా రూ. 7 కోట్లతో నూతనంగా నిర్మించే గిరిజన బాలుర వసతి గృహము మరియు సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణానికి స్పీకర్ పోచారం శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన సభలో సభాపతి పోచారం గారు మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక గత తొమ్మిది సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని ప్రజలను వివరించడానికే ఈ ఉత్సవాలు. గిరిజన దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.. గిరిజన, బంజారాల దశాబ్దాల కలలను నిజం చేసిన గొప్ప వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుండి నేటి వరకు గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు మొత్తం రూ. 53,417 కోట్లు.

తాండాలు, గిరిజన గూడేలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని గతంలో అనేక ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు హామీ ఇచ్చినా నేరవేర్చ లేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 3146 తాండాలను, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చారు. గిరిజన రిజర్వేషన్లు 6 శాతం నుండి 10 శాతానికి పెంచారు. దీనితో గిరిజనులకు విద్య, ఉద్యోగాలలో అధికంగా అవకాశాలు లభిస్తున్నాయి.

త్వరలోనే రాష్ట్రంలోని 1.50 లక్షల మంది గిరిజన రైతులకు నాలుగు లక్షలకు పైగా ఎకరాల పోడు భూములకు చెందిన పట్టాలు అందుతాయి. బాన్సువాడ నియోజకవర్గంలోని 2,104 మంది గిరిజన రైతులకు 3,830 ఎకరాల పోడు భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేస్తాం. ఈ భూములకు రైతుబంధు నగధు వస్తుంది, రైతులకు రైతుబీమా వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 98 గిరిజన గురుకుల పాఠశాలలు మంజూరు అయ్యాయి.

బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి తాండాకు రోడ్డు సౌకర్యం కల్పించాం. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ లలో GP భవనాలకు రూ. 20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశాను. బాన్సువాడ నియోజకవర్గానికి 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు అయితే అందులో బంజారాల కోసం 2000 డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇచ్చాను. స్పెషల్ డెవలప్మేంట్ ద్వారా నియోజకవర్గంలోని అన్ని తాండాలలో జగదాంబ, సేవాలాల్ మహారాజ్ దేవాలయాల కోసం రూ. 25 కోట్లు మంజూరు చేశాను. నస్రుల్లాబాద్ లోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో రామారావు మహారాజ్ విగ్రహాన్ని, ఈ విగ్రహాన్ని నా కుమారుడు, DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి గారు తన స్వంత ఖర్చులతో ఏర్పాటు చేయిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News