Friday, October 18, 2024
HomeతెలంగాణBansuvada: మానసిక ఆరోగ్య కేంద్రం, ఫిజియోథెరపీని ప్రారంభించిన స్పీకర్

Bansuvada: మానసిక ఆరోగ్య కేంద్రం, ఫిజియోథెరపీని ప్రారంభించిన స్పీకర్

బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన “జిల్లా మానసిక ఆరోగ్య కేంద్రం-వయోవృద్దుల ఫిజీయోథెరపి” కేంద్రాలను ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, DMHO లక్ష్మణ్ సింగ్, RDO రాజా గౌడ్, DSP జగన్నాధ్ రెడ్డి, పురపాలక సంఘం చైర్మన్ జంగం గంగాధర్, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు డి అంజిరెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీనివాస్ ప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, డాక్టర్లు, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

ఈసందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రిలో జిల్లా మానసిక ఆరోగ్య కేంద్రం మరియు వయోవృద్దుల ఫిజీయోథెరపి కేంద్రాలను ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. ఈ ప్రాంతంలోని మానసిక ఆరోగ్య రోగులకు, వృద్ధులకు ఈ కేంద్రాలతో చికిత్స లభిస్తుందని, జిల్లా కేంద్రంలో ఉన్న ఆసుపత్రిలో ఉండే స్థాయి సౌకర్యాలు బాన్సువాడ లో ఏర్పాటు చేయించామన్నారు. బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రిలో అధునాతన వైద్య పరికరాల ఏర్పాటుతో పాటుగా బ్లడ్ బ్యాంకు, డయాలసిస్ యూనిట్, ఆక్సిజన్ యూనిట్, టిఫా స్కాన్, SNCU , MICU లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వైద్య సౌకర్యాలతో పాటుగా రోగులకు వారి వెంట వచ్చే సహాయకుల కోసం ఆసుపత్రిలో వసతులు కల్పించామని, ఏరియా ఆస్పత్రికి నూతన భవనం నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించామన్నారు. రూ. 20 కోట్లతో 100 పడకల సామర్ధ్యంతో బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రి నిర్మించినట్టు, నెలకు 400 లకు పైగా డెలివరీలు జరుగుతున్నాయన్నారు.

ప్రారంభించిన రెండు సంవత్సరాల లోనే తల్లి పాల ప్రోత్సాహం అంశంలో బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రికి జాతీయ అవార్డు వచ్చిందని, ఈ అవార్డుతో బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రికి దేశంలోనే గుర్తింపు వచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఏరియా ఆస్పత్రి-మాతా శిశు ఆసుపత్రిని కలుపుతూ ప్రధాన రహదారి మీదుగా రూ. 3 కోట్లతో స్టీల్ బ్రిడ్జి నిర్మిస్తున్నట్టు, అనంతరం రెడ్ క్రాస్ డే సందర్భంగా బ్లడ్ బ్యాంకులో ఏర్పాటు చేసిన రక్తధాన శిబిరాన్ని స్పీకర్ పోచారం ప్రారంభించారు. రక్తదానం చేస్తున్న యువకులను ఆయన అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News