Sunday, September 8, 2024
HomeతెలంగాణBansuvada: రాం రావు మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన

Bansuvada: రాం రావు మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన

బాన్సువాడ పట్టణంలోని నూతనంగా ఏర్పాటు చేసిన సంత్ శ్రీ రాం రావు మహారాజ్ విగ్రహం ప్రతిష్టాపన, నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సంత్ శ్రీ రాంరావు మహారాజ్ విగ్రహ భూమి పూజలలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి.
అనంతరం బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్పీకర్ పోచారం గారు మాట్లాడుతూ… రాంరావు మహారాజ్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. నేను యువకునిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి విచ్చేసిన రాంరావు మహారాజ్ గారిని కలిసి మా ఇంటికి తీసుకువెళ్ళి పూజలు చేశామని తెలిపారు.
బాన్సువాడ నియోజకవర్గంలో 80 తాండాలు ఉంటే, ప్రతి తాండాలో జగదాంబ మాతా, సేవాలాల్ మహారాజ్ మందిరాలు ఉన్నాయని, జగదాంబ, సేవాలాల్ మహారాజ్ ల ఆశిస్సులతో అందరం చల్లగా ఉండాలని పోచారం అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News