Tuesday, September 10, 2024
HomeతెలంగాణBasara Bandh: బాసర బంద్, టెన్షన్ టెన్షన్

Basara Bandh: బాసర బంద్, టెన్షన్ టెన్షన్

సరస్వతి అమ్మవారిపై రెంజర్ల రాజేష్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇక్కడ టెన్షన్ నెలకొంది. రాజేష్ పై పీడా యాక్ట్ నమోదు చేయాలని, ఇంకొకరు ఎవరూ హిందూ దేవుళ్లను ఇలా దూషించకుండా కఠినాతి కఠిన చట్టాలు తేవాల్సిందేనంటూ వీరు డిమాండ్ చేస్తున్నారు. రాజేష్ వ్యాఖ్యలకు నిరసనగా బాసరలో స్వచ్చందంగా స్థానికులు బంద్ పాటిస్తున్నారు. నిత్యం భక్తులతో కళకళలాడే బాసర ఈరోజు బోసిపోయి, నిర్మానుష్యమైన రోడ్లతో కనిపిస్తోంది. చదువుల తల్లిపై తప్పుడు వాఖ్యలు చేసిన రాజేష్ రెంజర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. సంపూర్ణ బంద్ నేపథ్యంలో భారీ బలగాలను మోహరించారు. అర్చకులు సైతం ఈ బంద్ లో పాల్గొంటుండటం విశేషం. అయ్యప్పలపై నోరుపారేసుకున్న బైరి నరేష్ కు రాజేష్ మద్దతు పలికాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News