బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో కాగ్న నది ఒడ్డున శ్రీ మహాదేవ లింగేశ్వర స్వామి ఆలయంలో మాహాశివరాత్రి 37వ వార్షిక మహోత్సవము ప్రారంభమయ్యాయి. ఏటా ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవాలకు స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. వెండి పల్లకి సేవతోపాటు అగ్నిగుండ మహోత్సవం, పార్వతి పరమేశ్వరుల కల్యాణం కూడా నిర్వహించనున్నారు. అన్నదానంతోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లు పూర్తయ్యాయి.