Saturday, November 23, 2024
HomeతెలంగాణBayyaram: బంద్ సాకుతో ప్రభుత్వ పాఠశాలలు మూసివేత

Bayyaram: బంద్ సాకుతో ప్రభుత్వ పాఠశాలలు మూసివేత

టీచర్ల పనితీరుపై బహిరంగంగా నిలదీసినా మారని వైనం

బయ్యారం మండల కేంద్రంలో జిల్లా పరిధిలో ఎక్కడా లేని విధంగా ఏజెన్సీ ప్రాంతాలైన కస్తూరినగరం, జగత్రావు పేట, బోటి తండ, అల్లి గూడెం గ్రామల ప్రభుత్వ పాఠశాలను బందును సాకుగా చేసుకొని సుమారు ఐదు ఆరు ప్రభుత్వ పాఠశాలలు మూసి ఉపాధ్యాయులు ఇంటి బాట పడుతున్నారు. ఏబీవీపీ విద్యాసంస్థల బందుకు పిలుపునిచ్చింది. పాఠశాలల సమస్యల పైనా లేక విద్యార్థులను ఇంటికి పంపించి ఉపాధ్యాయులు కాలక్షేపం చేయడానికా అని స్థానిక ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వాస్తవంగా ఏజెన్సీ ప్రాంతంలో విద్యార్థుల భవిష్యత్తు పై ఎటువంటి ఆలోచన లేకుండా ఇలాంటి బంద్ పిలుపులతో ఎప్పుడేప్పుడు సెలవులు వస్తాయా..! ఎప్పుడు పాఠశాల నుంచి బయటపడి తమ తమ కార్యకలాపాలు, ప్రవేట్ వ్యాపారాలు నిర్వహించుకుందామని ఆసక్తిగా ఎదురు చూస్తారని, అంతేకాదు గతంలో అనేకసార్లు పాఠశాలలకు ఉదయం ఒక గంట ఆలస్యంగా రావడం సాయంత్రం గంట ముందే ఇంటి బాట పట్టడం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించకపోలేదని క్రీడాల్లో నైపుణ్యాలు నేర్పించకపోవడం వంటివి చేస్తూ వారి ఇష్టానుసారంగా వ్యవహరించే ఉపాధ్యాయులను గ్రామస్తులు బహిరంగంగానే నిలదీసిన వారి తీరు మాత్రం మారడం లేదని విమర్శిస్తున్నారు.

- Advertisement -

నెల రాగానే లక్షల్లో జీతాలు తీసుకుంటూ రియల్ ఎస్టేట్,ప్రవేట్ చిట్టి దందా, పలు రకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ కోట్లల్లో సంపాదిస్తూ విద్యార్థుల జీవితాలను చిన్న భిన్నం చేస్తున్నారని విద్యార్థిని తల్లిదండ్రులు స్థానికులు బహిరంగంగానే అక్కడక్కడ మాట్లాడుకుంటున్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టిన మా పిల్లలు కార్పొరేట్ శక్తులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయని ఒకే ఒక సదుద్దేశంతో మా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తుంటే ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు.

ఉపాధ్యాయులపై పెట్టుకున్న నమ్మకం సన్నగిల్లుతుంటే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాల నుండి కార్పొరేట్ పాఠశాలలో చేర్పించే అవకాశాలు లేకపోలేదని ఇప్పటికైనా ఈ ఉపాధ్యాయుల పనితీరు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందక చిన్నచితిక కూలి పనులు చేసుకుంటూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మేము కాయకష్టం చేసి మా బిడ్డలు కష్టం చేస్తూ ఉంటే భవిష్యత్తులో అత్యధిక శాతం నిరుద్యోగ రేటు పెరిగే అవకాశం ఉందని పలువురు విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News