Monday, May 19, 2025
HomeతెలంగాణBansuvada: సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభించిన పోచారం

Bansuvada: సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభించిన పోచారం

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,000 స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ స్కీం

బాన్సువాడ గ్రామీణ మండలం జక్కలదాని తాండా (జెకే తాండా) ప్రాధమిక పాఠశాలలో ‘ముఖ్యమంత్రి అల్పాహారం’ పథకాన్ని ప్రారంభించి‌, విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని తిన్న తెలంగాణ రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్ధిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -

ఈసందర్భంగా సభాపతి పోచారం మాట్లాడుతూ..

ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ఈరోజు నుంచి ప్రారంభిస్తున్న సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,000 పాఠశాలలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న ఇరవై లక్షల మంది విద్యార్ధులకు ముఖ్యమంత్రి అల్పాహార పథకం అందుతుంది. ఈరోజు నియోజకవర్గంలోని ఒక్క పాఠశాలలో ప్రారంభిస్తారు. దసరా సెలవుల తరువాత నుండి అన్ని పాఠశాలలో మొదలవుతుంది.

ప్రతిరోజూ ఉదయం 8.45 గంటలకు విద్యార్థులకు అల్పాహారాన్ని అందిస్తారు. ప్రతిరోజూ మెనూ ప్రకారం అల్పాహారం ఉంటుంది. ఉపాధ్యాయులు బాధ్యత వహించి మంచి వంట సరుకులను వాడే విదంగా పర్యవేక్షించాలి. పదార్థాలను రుచిగా వండితే పిల్లలు తృప్తిగా, కడుపు నిండా తింటారు. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ నిత్యం ఉండాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News