రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మను పేర్చిన్నట్లుగా ప్రతి ఆఫీసులో ఉద్యోగులందరూ కలిసి పని చేసి, ప్రజలకు అవసరమైన సేవలు అందించాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి ఆకాంక్షించారు. మాసాబ్ ట్యాంక్ లోని సంక్షేమ భవన్లో ఘనంగా జరిగిన బతుకమ్మ ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖలోని వివిధ విభాగాలకు బతుకమ్మ పోటీలను నిర్వహించి, అందమైన బతుకమ్మలకు బహుమతులు ఇచ్చారు. ప్రతి కార్యాలయంలోనూ ఉద్యోగులందరూ కలిసిమెలిసి పని చేసినప్పుడే ప్రభుత్వం ఆశించిన ఫలితాలు అందుతాయన్నారు. ప్రజాసేవే ప్రతి అధికారి బాధ్యత అని, నిబద్దతలో పనిచేయాలని ఆమె సూచించారు.
మొదటి బహుమతి..
బిసీ సంక్షేమ శాఖలో వివిధ విభాగాల అధికారులు, మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పోటీల్లో బిసి కార్పొరేషన్, ఎంజెపి సొసైటీ, బిసి స్టడి సర్కిల్ మొదటి బహుమతి గెలుపొందాయి.
ఈ కార్యక్రమంలో ఎంజెపి సొసైటీ జాయింట్ సెక్రటరీ లు తిరుపతి, మద్దిలేటి, బిసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు చంద్రశేఖర్, అలౌక్ కుమార్ , సంధ్య, శ్రీనివాస్ రెడ్డి, ఝాన్సీ, పద్మజ, సిబ్బంది పాల్గొన్నారు.