Saturday, November 23, 2024
HomeతెలంగాణBest Teacher: రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికైన లింగారెడ్డి

Best Teacher: రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికైన లింగారెడ్డి

వాణిజ్యశాస్త్ర సహాయ ఆచార్యులు

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన కాటిపల్లి లింగారెడ్డి వాణిజ్యశాస్త్ర సహాయ ఆచార్యులకి 2023 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అధ్యాపక పురస్కారానికి ఎంపిక చేసింది. లింగారెడ్డి ప్రస్తుతం కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల హనుమకొండలో వాణిజ్యశాస్త్ర సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నారు.
2004 సంవత్సరంలో అధ్యాపక వృత్తి చేపట్టిన లింగారెడ్డిని విద్యా బోధనలో నూతన పద్ధతులు, పరిశోధన, పుస్తకాల రచన, పోటీ పరీక్షల శిక్షణ, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు, సామాజిక సేవ మొదలగు అంశాల్లో చేసిన కృషిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వము ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవంను పురస్కరించుకొని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు.
✳️ లింగారెడ్డి ప్రత్యేకతలు….
ఇప్పటివరకు 12 పాఠ్యాంశ పుస్తకాలు రూపొందించాడు.
25 జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పరిశోధన పత్రాలు సమర్పించాడు.
40 కి పైగా సమావేశాలు, సదస్సులలో ముఖ్య వక్త గా కీలక ఉపన్యాసాలు చేశాడు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిధులతో ఒక మైనర్ రీసెర్చ్ ప్రాజెక్టు కూడా పూర్తి చేశాడు.
విద్యాబోధనలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ అకౌంటింగ్ , స్టాటిస్టిక్స్ , ఫైనాన్స్, ఇన్ కంటాక్స్ సబ్జెక్టులకు సంబంధించి పది సెల్ఫ్ లర్నింగ్ మోడల్స్ ను రూపొందించాడు.
కంప్యూటరయిజ్డ్ అకౌంటింగ్, జిఎస్టి శిక్షణలో ఇప్పటివరకు వేయికి పైగా విద్యార్థులకు శిక్షణ అందించాడు.
30 కి పైగా వ్యక్తిత్వ వికాస ఉపన్యాసాలు ఇచ్చాడు.
2017 నుండి యూట్యూబ్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా జాతీయ, రాష్ట్రస్థాయి వివిధ పోటీ పరీక్షలకు కావలసినటువంటి స్టడీ మెటీరియల్, మెలకువలను అందిస్తున్నాడు, ప్రస్తుతం రెండు వేలకు పైగా విద్యార్థులు వాట్సాప్ గ్రూప్ ల ద్వారా 600 మంది విద్యార్థులు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ప్రయోజనాన్ని పొందుతున్నారు. వీటి ద్వారా డైలీ ఇంగ్లీష్ అనే శీర్షిక తో విద్యార్థులకు, ఉద్యోగార్దులకు సులభతర ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలను కూడా అందిస్తున్నాడు.
ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిగా 10 సంవత్సరాల పాటు విశిష్ట సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు.
పది మెడికల్ క్యాంపులు.
8 వెటర్నరీ క్యాంపులు.
16 బ్లడ్ గ్రూపింగ్ క్యాంపులు.
15 స్వచ్ఛభారత్ కార్యక్రమాలు.
20 హరితహారం కార్యక్రమాలు.
పది ప్రత్యేక శిబిరములు నిర్వహించారు.
వ్యక్తిగత పరిశుభ్రత పై మూఢనమ్మకాలపై, అక్షరాస్యతపై, న్యాయ విజ్ఞానము పై చైతన్య మరియు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో, పబ్లిక్ సముదాయాలలో రోడ్లు, సాగునీటి కాలువలు, వాటర్ ట్యాంకులు, సమావేశ వేదికలు మొదలగు సామాజిక ఆస్తులను నిర్మించారు.
కళాశాలలో శిక్షణ, ప్లేస్మెంట్ అధికారిగా విద్యార్థులకు కావాల్సిన కార్పొరేట్ నైపుణ్యాలు అందిస్తూ క్యాంపస్ జాబ్ మేళాలు నిర్వహించాడు.
కళాశాల లో బోధనతోపాటు నిర్వహణలో: అడ్మిషన్స్, స్కాలర్షిప్ రూసా, అకాడమిక్, పరీక్షల విభాగము సమన్వయకర్తగా అదనపు బాధ్యతలు చేపట్టి కళాశాల అభివృద్ధిలో భాగమయ్యాడు.
✳️ఇప్పటి వరకు పొందిన పురస్కారాలు…
2000 సంవత్సరంలో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎం కాం లో స్వర్ణ పథకం
2004లో ఏపీపీఎస్సీ ద్వారా జూనియర్ లెక్చరర్ నియామకం పరీక్షలో కామర్స్ సబ్జెక్టులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదటి ర్యాంక్.
2009 సంవత్సరంలో జూనియర్ లెక్చరర్ గా అందించిన సేవలకు గాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఉత్తమ సేవా పురస్కారం.
2010 సంవత్సరంలో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి యూనివర్సిటీ ఉత్తమ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి పురస్కారం.
2023 జూన్ లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో జిల్లాస్థాయి ఉత్తమ అధ్యాపక పురస్కారం స్వీకరించాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News