Saturday, November 15, 2025
HomeతెలంగాణBharat Bhavan: 'భారత్‌ భవన్‌' కు కేసీఆర్ భూమి పూజ

Bharat Bhavan: ‘భారత్‌ భవన్‌’ కు కేసీఆర్ భూమి పూజ

ఏ జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ఇలాంటి వ్యవస్థ లేని వినూత్న సదుపాయాలు సృష్టిస్తున్న బీఆర్ఎస్

అన్ని అత్యాధునిక సాంకేతిక హంగులతో భారత్‌ భవన్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్ కేంద్రం నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌ లోని కోకాపేటలో 11 ఎకరాల్లో 15 అంతస్థుల్లో సువిశాలంగా నిర్మిస్తున్న ఈ భారీ భవన నిర్మాణ పనులను సీఎం కేసీఆర్‌ భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన చండీహోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

- Advertisement -

ఎంపీలు కే కేశవరావు, వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, బీబీ పాటిల్‌, దామోదర్‌ రావు, సురేశ్‌ రెడ్డి, రంజిత్‌ రెడ్డి, పసునూరి దయాకర్‌, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, శంభీపూర్‌ రాజు, మధుసూదనా చారి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కాలె యాదయ్య, పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మనదేశంలోని ఏ జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ఇలాంటి వ్యవస్థ లేకపోగా కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ తరహా వినూత్న ఆలోచన చేశారు కేసీఆర్. రాజకీయపరమైన అవగాహన కార్యక్రమాలు, శిక్షణా తరగతుల నిర్వహణ, కార్యకర్తలు, నాయకులకు అవసరమైన సమస్త, సమగ్రమైన సమాచారం లభించే కేంద్రంగా ఇది రూపుదిద్దుకోనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad