పెట్టుబడులు, ప్రపంచ శాంతి, అహింస లక్ష్యంగా హైదరాబాద్ వేదికగా నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న భారత్ సమ్మిట్ -2025 (Bharat Summit) ఘనంగా ప్రారంభమైంది. హెచ్ఐసీసీ నోవాటెల్ లో జరుగుతున్న ఈ సమ్మిట్‌కు 100కు పైగా దేశాల నుంచి 450కి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమ్మిట్‌కు విచ్చేసిన విదేశీ ప్రతినిధులకు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా బోనాలు, డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తెలిసేలా ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ సమ్మిట్ ఏర్పాట్లను కాంగ్రెస్ ముఖ్య నేతలు పరిశీలించారు.
కాగా రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఏఐసీసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొననున్నారు. ఈ సమ్మిట్ ప్రపంచ వేదికగా భారత్ ప్రాముఖ్యతను మరింతగా చాటిచెబుతుందని భావిస్తున్నారు.