Wednesday, January 22, 2025
HomeతెలంగాణBhatti JNTU: అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జేఎన్టీయూ సభలో డిప్యూటీ సీఎం భట్టి

Bhatti JNTU: అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జేఎన్టీయూ సభలో డిప్యూటీ సీఎం భట్టి

పుష్పాంజలి

అంబేద్కర్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని, జీవితంలో అనేక అవమానకర సంఘటనలపై ఆయన పాజిటివ్ గా స్పందించారని, దేశంలోని సమస్యల పరిష్కారానికి భారత రాజ్యాంగం ఒక్కటే దిక్కని డిప్యుటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క అన్నారు.

- Advertisement -

దేశంలో అద్భుతమైన మానవ వనరులు ఉన్నాయని, అవి జాతుల పోరాటంలో వృధా అవుతున్నాయని, అది లేకుంటే భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకునేదని అన్నారు భట్టీ.

విద్య ద్వారా మాత్రమే సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని భావించి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యారంగంలో ఖర్చు చేస్తుందని, సమగ్ర కుటుంబ సర్వే 99 శాతం పూర్తయింది త్వరలో ప్రజల ముందు పెడతామన్నారు. ఆధునిక భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ శ్రమించడమే అంబేద్కర్ కు ఘన నివాళి అంటూ భట్టీ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News