Tuesday, April 1, 2025
HomeతెలంగాణTG Assembly: అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క

TG Assembly: అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (TG Assembly) చివరి రోజు కొనసాగుతున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) సభలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కాగ్(CAG) నివేదికను ప్రవేశ పెట్టారు.

- Advertisement -

కాగ్ నివేదిక ప్రకారం.. 2023-24 బడ్జెట్ అంచనా రూ. 2,77,690 కోట్లు, చేసిన వ్యయం రూ. 2,19,307 కోట్లుగా ఉంది. బడ్జెట్ అంచనాలో 79 శాతం వ్యయం లభించింది. జీఎస్డీపీలో వ్యయం అంచనా 15 శాతం వచ్చింది. ఆమోదం పొందిన బడ్జెట్ కంటే ప్రభుత్వం అదనంగా అంచనాల్లో 33 శాతం రూ.1,11,477 కోట్లు ఖర్చు చేసింది. 349 రోజుల పాటు రూ.10,156 కోట్లు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ సదుపాయాన్ని వినియోగించుకుంది.రూ. 35,425 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని 145 రోజుల పాటు ప్రభుత్వం వినియోగించుకుంది. ఇక 2023-24 లో వడ్డీల చెల్లింపుల కోసం రూ. 24,347 కోట్ల వ్యయం అవ్వగా.. వేతనాలకు 26,981 కోట్లు ఖర్చు చేసింది. ఖజానాకు పన్ను ఆదాయం నుంచే 61.83 శాతం నిధులు సమకూరాయి.

2023-24 లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ల మొత్తం కేవలం రూ. 9934 కోట్లు మాత్రమే. రెవెన్యూ రాబడుల్లో 45 శాతం వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకే ఖర్చు చేశారు. 2023-24 లో రెవెన్యూ మిగులు రూ. 779 కోట్లుగా అంచనా వేసింది. రెవెన్యూ లోటు రూ.49,977 కోట్లు, జీఎస్డీపీలో రెవెన్యూ లోటు శాతం 3.33గా తెలిపింది. 2023-24 ముగిసే వరకు రుణాల మొత్తం రూ. 4,03,664 కోట్లు, జీఎస్డీపీలో అప్పుల శాతం 27గా ఉంది. 2023-24 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల మొత్తం రూ. 2,20,607 కోట్లు. 2023-24 లో తీసుకున్న ప్రభుత్వం 50,528 కోట్లలో 43,918 కోట్లను మూలధనం వ్యయంపై ఖర్చు చేసింది. 2023-24 లో స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు రూ.76,773 కోట్లు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News