యూట్యూబర్ సన్నీ యాదవ్(Sunny Yadav)పై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ యువతను తప్పు దోవ పట్టిస్తున్నారంటూ ఆర్టీసీ ఎంపీ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఆధారంగా సూర్యాపేట పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సజ్జనార్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ విషయమై తాజాగా నూతన్‌కల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మీడియాతో మాట్లాడారు. సన్నీ యాదవ్ సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ చెందిన వ్యక్తి అని తెలిపారు. తనకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలలో బెట్టింగ్ యాప్స్ తరుపున ప్రకటనలు చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి వీడియోల వల్ల యువతపై ప్రభావం పడుతుందన్నారు. తమకు అందిన పలు ఫిర్యాదుల ఆధారంగా అతిపై మార్చి 5న కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం సన్నీ యాదవ్ పరారీలో ఉన్నాడని.. త్వరలోనే అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు.