Monday, April 7, 2025
HomeతెలంగాణBhimadevarapalli: తల్లిదండ్రులను కోల్పోయి అనాధాలుగా మారిన చిన్నారులు

Bhimadevarapalli: తల్లిదండ్రులను కోల్పోయి అనాధాలుగా మారిన చిన్నారులు

ముల్కనూరులో విషాద ఛాయలు

అమ్మా.. లే అమ్మ మమ్ముల్ని ఎవరు చూస్తారు.. అంటూ చిన్నారులు విలపించిన తీరు అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించింది. తల్లిదండ్రుల ఒడిలో హాయిగా గడపాల్సిన చిన్నారులు గుక్కపట్టి ఏడుస్తున్నారు. ఆరు నెలల క్రితం తండ్రిని కోల్పోయి శనివారం రోజున తల్లిని కోల్పోయి వారు అనాధలుగా అయిన ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు బిసి కాలనీకి చెందిన పిట్టల శ్యామ్ భూమికల వారిద్దరి మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు కుండ చేత పట్టి అంతిమయాత్ర ముగిసే వరకు అమ్మనాన్నలను తలచుకుంటూ శోకసంద్రంలో మునిగారు. తమకు దిక్కెవరు అని గుండెలు బాదుకుంటుండగా బంధువులు, గ్రామస్తులు వారిని ఓదార్చుతూనే కన్నీటి పర్యంతమయ్యారు. అన్నీ తామై తల్లికి తలకొరివి పెట్టారు. చిన్నారులకు ఎవరైనా దాతలు సహాయం చేయాలని గ్రామస్తులు కోరారు. వారికి అమ్మమ్మ దిక్కయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News